ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో నాలుగు వారాలను కంప్లీట్ చేసుకుని ఎక్స్ లెంట్ లాభాలతో మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) దుమ్ము దుమారం లేపుతూ 5వ వీకెండ్ లో మళ్ళీ ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం.
సినిమా ఈ వారంలో సైతం కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ మంచి జోరుని చూపిస్తున్న దేవర మూవీ 30వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 29వ రోజు మీద మంచి గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా…సినిమా మొత్తం మీద ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తం మీద 34-36 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ లెక్కలు మరికొంత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల…
ఆవల సినిమా స్క్రీన్స్ ను మరింతగా కోల్పోగా ఇక మేజర్ షేర్ ని AP-TG లో నుండే కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ కి అటూ ఇటూ గా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
మొత్తం మీద మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ను చూపెడుతూ ఉండగా 5వ వీకెండ్ లో సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం. ఇక టోటల్ గా 30 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.