బాక్స్ ఆఫీస్ దగ్గర పాత సినిమాలు రన్ స్లో అయిన తర్వాత కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి టాక్ ఎలా ఉన్నా కూడా టికెట్ సేల్స్ పరంగా ఎంతో కొంత జోరుని అయితే చూపిస్తాయి….కానీ రిలీజ్ అయ్యి నెల అయిపోయినా కూడా విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఇప్పటికీ కూడా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించి రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఈ క్రమంలో సినిమా 34వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి జోరుని చూపించగా లిమిటెడ్ థియేటర్స్ లోనే కొన్ని చోట్ల ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీని కూడా నమోదు చేయగా సినిమా…
34వ రోజు టికెట్ సేల్స్ ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ లో బిగ్ మూవీ అయిన విశ్వక్ సేన్ లైలా కన్నా కూడా బెటర్ గా ఉండటం అందరినీ ఆశ్యర్యపరిచింది…34వ రోజున సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్ సేల్స్ పరంగా లైలా మూవీ 3వ రోజు టికెట్ సేల్స్ కి మించి రచ్చ లేపడం విశేషం..
లైలా మూవీ 3వ రోజున అతి కష్టం మీద 5-5.5 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మరో సారి తీవ్రంగా నిరాశ పరిచింది. అదే టైంలో 34వ రోజులో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ వస్తూ ఉండటంతో..
34వ రోజున సినిమాకి ఓవరాల్ గా 7.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ సొంతం అయ్యి ఈ వీక్ బెటర్ న్యూ రిలీజ్ కన్నా కూడా ఎక్కువ టికెట్ సేల్స్ తో ఊరమాస్ జాతరని కొనసాగిస్తుంది. లైలా మూవీ భారీ డిసాస్టర్ గా నిలవగా సంక్రాంతికి వస్తున్నాం 5వ వారం ఎండ్ టైంలో కూడా కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ ఉండటం మాస్ రచ్చ అనే చెప్పాలి.