బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి(Kalki 2898 AD Movie) రీసెంట్ టైంలో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ ఓపెనింగ్స్ తో పోటి పడుతూ లాంగ్ రన్ లో జోరు చూపించే అవకాశం ఉండగా మూడు రోజులు పూర్తి అయిన తర్వాత RRR Movie, KGF Chaptar2, సలార్ లాంటి సినిమాలతో కంపేర్ చేస్తే ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంది అన్నది ఆసక్తిగా మారగా….
ముందుగా ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే 3 వ రోజున 78.73 కోట్ల షేర్ ని 140 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 3 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 281.17 కోట్ల రేంజ్ లో షేర్ ని 496 కోట్ల మమ్మోత్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అల్టిమేట్ రికార్డులను నమోదు చేసింది…
ఇక తర్వాత వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 3వ రోజున 64.14 కోట్ల రేంజ్ లో షేర్ ని 137.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 3 రోజుల్లో ఈ సినిమా 215.92 కోట్ల రేంజ్ లో షేర్ ని అలాగే 430.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది….
ఇక సలార్ మూవీ 3వ రోజున 42.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 78.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. ఇక 3 రోజుల్లో టోటల్ గా ఈ సినిమా 185.67 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 330 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది…. ఇక లేటెస్ట్ గా వచ్చిన ప్రభాస్ కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…
3వ రోజున 51.68 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 101.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. ఇక టోటల్ గా 3 రోజుల్లో ఈ సినిమా 198.04 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 380.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ టాప్ లో తర్వాత కేజిఎఫ్2, కల్కి మరియు సలార్ లు ఉన్నాయి…
ఇక 4వ రోజు ఇప్పుడు కల్కి మూవీ కి సండే అడ్వాంటేజ్ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఓవరాల్ గా 4 రోజుల కలెక్షన్స్ పరంగా ఈ పాన్ ఇండియా మూవీస్ కలెక్షన్స్ కి కల్కి ఎంతవరకు దగ్గరగా వస్తుందో చూడాలి ఇప్పుడు.