తొలి 2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయిన ఆదిపురుష్ (AdiPurush) మూవీ తెలుగు రాష్ట్రాలలో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ దూసుకు పోయింది. రెండో రోజు సినిమా అనుకున్న దానికన్నా బెటర్ గా హోల్డ్ చేసింది.
ఇక మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా తెలుగు కి మించి హిందీలో మరోసారి దుమ్ము దుమారం లేపుతుంది ఈ సినిమా… నైజాంలో సినిమా హోల్డ్ మరో లెవల్ లో ఉందని చెప్పాలి ఇప్పుడు. నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం…
ఉండగా ఆంధ్ర మరియు సీడెడ్ లలో మంచి హోల్డ్ ఉన్నా బి సి సెంటర్స్ లో కలెక్షన్స్ లో డ్రాప్స్ ఉన్నాయి. అయినా కూడా సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు లెవల్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా…
షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది… ఇక సినిమా హిందీలో తొలి రెండు రోజుల కన్నా బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా సినిమా ఈ రోజు 38-40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. కర్ణాటకలో మరోసారి మంచి హోల్డ్ ని సొంతం చేసుకోవచ్చు.
తమిళ్ మరియు కేరళలో మాత్రం సినిమా ఏమాత్రం హోల్డ్ చూపించడం లేదు… ఇక ఓవర్సీస్ లో కూడా తెలుగు వర్షన్ అనుకున్న రేంజ్ లో హోల్డ్ లేదు, హిందీ వర్షన్ పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తుంది. మొత్తం మీద మూడో రోజు సినిమా వరల్డ్ వైడ్ గా 38-40 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.