Home న్యూస్ కెరీర్ బెస్ట్ 3rd డే కొట్టేసిన బాలయ్య….పోటిలో అరాచకం ఇది!!

కెరీర్ బెస్ట్ 3rd డే కొట్టేసిన బాలయ్య….పోటిలో అరాచకం ఇది!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా మూడో రోజు సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ లభించగా పోటిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా….

స్క్రీన్స్ ను కొన్ని తీసుకుని ఊహకందని రాంపెజ్ ను చూపించినా కూడా డాకు మహారాజ్ జోరు మాత్రం తగ్గలేదు…2 సినిమాల మధ్య పోటిలో కూడా మూడో రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా బాలయ్య కెరీర్ లోనే మూడో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…ఇది వరకు బాలయ్య నటించిన అఖండ మూవీ మూడో రోజున 7.03 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత చేసిన వీర సింహా రెడ్డి సినిమా 6.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది….ఆ తర్వత వచ్చిన బాలయ్య భగవంత్ కేసరి సినిమా…

మూడో రోజున 4.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తూ పోటి లో కూడా డాకు మహారాజ్ మూవీ 9.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మూడో రోజు కూడా బాలయ్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

సినిమా ఒక దశలో ఊపు సాలిడ్ గా ఉండటంతో డబుల్ డిజిట్ షేర్ మార్క్ ని అందుకుంటుంది అనిపించినా కూడా సంక్రాంతికి వస్తున్నాం ఊచకోత వలన స్క్రీన్ కౌంట్ కొంచం తగ్గడం వలన డబుల్ డిజిట్ మార్క్ ని అందుకోలేక పోయినా బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని మూడో రోజు అందుకుంది. ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here