Home న్యూస్ కల్కి-RRR మూవీ-KGF2….3 వీక్స్ కలెక్షన్స్ కంపారిజన్!!

కల్కి-RRR మూవీ-KGF2….3 వీక్స్ కలెక్షన్స్ కంపారిజన్!!

0
Kalki2898AD Vs RRR Movie Vs KGF Chapter2 3 Weeeks(21 Days) Collections comparison
Kalki2898AD Vs RRR Movie Vs KGF Chapter2 3 Weeeks(21 Days) Collections comparison

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడు వారాలను కంప్లీట్ చేసుకుంది. అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా పెద్దగా హాలిడేస్ అడ్వాంటేజ్ లేకుండానే సెన్సేషనల్ రన్ ని కొనసాగించి ఇప్పుడు 3 వారాల్లో ఓవరాల్ గా సాలిడ్ గా లాభాలను కూడా ఎంజాయ్ చేస్తుంది.

ఇక 3 వారాల కలెక్షన్స్ పరంగా ప్రీవియస్ బిగ్ పాన్ ఇండియా సక్సెస్ లు గా నిలిచిన RRR Movie మరియు KGF Chapter2 Movie ల తో కంపేర్ చేస్తే 3 వారాల కలెక్షన్స్ పరంగా పోటాపోటిగా వసూళ్ళని సొంతం చేసుకుందని చెప్పాలి… ముందుగా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే….

ఆర్ ఆర్ ఆర్ మూవీ 3 వారాల్లో 261.07 కోట్ల షేర్ ని 393.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. డబ్ మూవీ అయిన కేజిఎఫ్ చాప్టర్2 సినిమా 80.90 కోట్ల షేర్ ని 130.65 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి మూవీ 3 వారాల్లో 177.65 కోట్ల షేర్ ని 277.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ మూవీ షేర్ పరంగా 3 వారాల్లో 575.89 కోట్ల షేర్ ని అందుకోగా తర్వాత వచ్చిన కేజిఎఫ్2 సినిమా 541.80 కోట్ల షేర్ ని అందుకుంది. ఇప్పుడు కల్కి మూవీ 506 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది…. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే…

ఆర్ ఆర్ ఆర్ మూవీ 1057.00 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా కేజిఎఫ్2 మూవీ 1097.10 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక ఇప్పుడు కల్కి మూవీ 989.50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది… ఓవరాల్ గా షేర్ పరంగా తెలుగు రాష్ట్రాల సాలిడ్ కలెక్షన్స్ హెల్ప్ తో ఆర్ ఆర్ ఆర్ మూవీ టాప్ లో ఉండగా…

గ్రాస్ పరంగా హిందీలో సాధించిన మమ్మోత్ కలెక్షన్స్ హెల్ప్ తో కేజిఎఫ్2 టాప్ లో ఉంది. కల్కి మూవీ స్టడీగా పరుగును కొనసాగిస్తూ అన్ని చోట్లా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపెడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here