బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ సిరీస్ అలాగే రూలర్ లాంటి సినిమాలు బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి ఒకటికి మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకున్న తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కెరీర్ లోనే లోవేస్ట్ ఫేజ్ లోకి వెళ్ళిపోయాడు… ఆ టైంలో బాలయ్య సినిమాలు…
ఇక జనాలు చూస్తారో లేదో అన్న అనుమానాలు రేకెత్తిన తరుణంలో తనకి ఫ్లాఫ్స్ లో ఉన్నప్పుడు సింహా(Simha) మరియి లెజెండ్(Legend) లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ తో కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Sreenu) తో బాలయ్య చేసిన అఖండ(Akhanda Movie) పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి ఫస్ట్…
బిగ్ రిలీజ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినా అప్పటి బాలయ్య హాట్రిక్ డిసాస్టర్స్ ఎఫెక్ట్ అలాగే కోవిడ్ ఎఫెక్ట్ లతో అంచనాలను అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ నడుమ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది, సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాలయ్య కెరీర్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది…
ఆ సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Akhanda Total World Wide Collections Report
👉Nizam: 21.17Cr
👉Ceeded: 16.05Cr
👉UA: 6.34Cr
👉East: 4.22Cr
👉West: 4.31Cr
👉Guntur: 4.87Cr
👉Krishna: 3.68Cr
👉Nellore: 2.64Cr
AP-TG Total:- 63.28CR(105.22CR~ Gross)
👉Ka+ROI: 5.21Cr
👉OS – 5.76Cr
Over Flows- 0.85Cr
Total WW: 75.10CR(133.20CR~ Gross)
54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 21 కోట్లకు పైగా లాభంతో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంబ్యాక్ గా నిలిచింది, అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు అవ్వగా ఇప్పుడు హాట్రిక్ విజయాలతో దూసుకు పోతున్న బాలయ్య కెరీర్ బెస్ట్ ఫాం లో ఉన్నాడు… ఇక ఫ్యూచర్ మూవీస్ తో ఏ రేంజ్ లో రచ్చ లేపుతాడో చూడాలి.