Home న్యూస్ దెబ్బ పడిందిగా…పాగల్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్!

దెబ్బ పడిందిగా…పాగల్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ పాగల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమాకి తొలి ఆటకే మిక్సుడ్ టాక్ వచ్చింది, అయినా కానీ ఫస్ట్ డే అలాగే రెండో రోజు ఇండిపెండెంట్స్ డే కలిసి రావడం తో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు నుండి వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వడం తో ఆ ఇంపాక్ట్…

గట్టిగా పడి కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ లో వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేక పోతుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3 వ రోజు 47 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించగా 4 వ రోజు 31 లక్షల రేంజ్ షేర్ ని అందుకుంది. 4 వ రోజు….

25 లక్షల లోపే షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గా 31 లక్షల దాకా వచ్చినప్పటికీ ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మాత్రం ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోని పరిస్థితి ఏర్పడింది. సినిమా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సాధించాలి.

ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే..
👉Nizam: 1.56Cr
👉Ceeded: 0.47Cr
👉UA: 48L
👉East: 22L
👉West: 13L
👉Guntur: 24L
👉Krishna: 14L
👉Nellore: 10L
Total AP TG: 3.34CR(5.90CR~ Gross)
👉KA+ROI: 10L
👉OS: 16L~(updated)
TOTAL Collections: 3.60CR(6.45CR~ Gross)
ఇదీ సినిమా 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్…

ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా బిజినెస్ 6 కోట్లకు పైగా జరగగా 6.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 4 రోజుల తర్వాత సినిమా మరో 2.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా బిజినెస్ ఇప్పుడు కొంచం వెనక్కి ఇచ్చే పనిలో ఉన్నారని ట్రేడ్ టాక్, అలా అయితే టార్గెట్ తగ్గి బ్రేక్ ఈవెన్ కి కొంచం అయినా చేరువ అవుతుందని భావిస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here