హీరోలు అయినా డైరెక్టర్స్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కన్సిస్ టన్సీ అన్నది చాలా ముఖ్యం అని చెప్పాలి. వరుస పెట్టి హిట్లు కొట్టాల్సిన అవసరం లేదు కానీ ప్రతీ సారి పర్వాలేదు అనిపించే మూవీస్ చేస్తూ వాటికి డీసెంట్ బిజినెస్ చేసుకునేలా ఉంటె సరిపోతుంది. టాలీవుడ్ లో చాలా మంది ఒకటి రెండు హిట్లు కొట్టి తర్వాత ఆశించిన సక్సెస్ లు రాకా కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యింది.
అలాంటి వాళ్ళలో క్లాస్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ అడ్డాల కూడా ఉంటాడు, కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి హిట్ కొట్టగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో అందరినీ మెప్పించిన అడ్డాల తర్వాత ముకుంద తో కొందరినే మెప్పించాడు.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాసిక్ మూవీ ఇచ్చాడు కాబట్టి మహేష్ తన డేట్స్ ని కొత్త సినిమా కోసం ఇవ్వగా బ్రహ్మోత్సవం కథ బాగానే చెప్పినా టేకింగ్ పరంగా మిస్ ఫైర్ అవ్వడం తో కోలుకోలేక పోయాడు శ్రీకాంత్ అడ్డాల… దాంతో ఏకంగా 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి తన ట్రాక్ రికార్డ్ కి పూర్తి విరుద్దంగా…
ఊర నాటు మాస్ మూవీ అయిన అసురన్ ని తెలుగు లో వెంకీ తో రీమేక్ చేసే ఛాన్స్ రాగా ఈ సినిమా కోసం ముందుగా అడ్డాల తీసుకున్న రెమ్యునరేషన్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారగా… సినిమా కరోనా వల్ల ఆలస్యం అవ్వడం తో ఓవరాల్ గా రెమ్యునరేషన్ కొంచం పెరిగి ఈ సినిమా కి టోటల్ గా…
80-90 లక్షల రేంజ్ రెమ్యునరేషన్ ని మాత్రమే అడ్డాల తీసుకుంటున్నారు అని టాలీవుడ్ ట్రేడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది… బ్రహ్మోత్సవం సినిమాకి 9 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… నారప్ప సినిమా కోసం రోజుకి 2 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నారని, ఓవరాల్ రెమ్యునరేషన్ 90 లక్షల లోపు ఉంటుందని అంటున్నారు. ఇంత భారీగా రెమ్యునరేషన్ తగ్గినా ఈ సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ గా మళ్ళీ క్రేజ్ పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.