టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ తర్వాత వరుస పెట్టి సినిమాలను చేస్తానని చెప్పినా సైరా నరసింహా రెడ్డికి చాలా టైం తీసుకోగా ఆ సినిమా తర్వాత చేసిన సినిమా రిలీజ్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది… కానీ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ ఏడాది టైంలో మెగాస్టార్ నటించిన 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా ఈ సమ్మర్ లో భోలా శంకర్ కూడా రిలీజ్ కి ఉండటంతో ఓవరాల్ గా…
ఒక్క ఏడాది గ్యాప్ లో 4 సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా రచ్చ చేశాడు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే టోటల్ గా లాస్ట్ ఏడాది గ్యాప్ లో 3 సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో ఒక సినిమా ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. మరో సినిమా హిట్ టాక్ తో కూడా…
ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. ఇలా 2 దెబ్బలు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా పడ్డ తర్వాత మెగాస్టార్ మెగా కంబ్యాక్ ఇచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రస్తుతానికి 216 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా… ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాల కలెక్షన్స్ తో కలిపి అక్షరాలా ఇప్పుడు…
400 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం విశేషం… ఆచార్య టోటల్ రన్ లో 76 కోట్ల గ్రాస్ ను అందుకుంటే గాడ్ ఫాదర్ మూవీ 108.7 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా ప్రస్తుతానికి 216 కోట్లతో ఉండగా 3 సినిమాలు కలిపి 400.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవడం విశేషం. 2 దెబ్బలు పడ్డా ఓవరాల్ గా ఏడాదిలో సీనియర్ హీరోగా మిగిలిన హీరోలను డామినేట్ చేసే రేంజ్ కలెక్షన్స్ ని అందుకున్నాడు మెగాస్టార్.