బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పట్లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న ప్రదీప్ మాచిరాజు(pradeep machiraju) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada Abbayi Movie) సినిమాతో మరో హిట్ అందుకుంటాడు అనుకున్నా కూడా సినిమా…
డీసెంట్ టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది…3 రోజుల్లో ఓవరాల్ గా 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమా..
4వ రోజున మరో హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోయిన సినిమా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా..
ఓవరాల్ గా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 1.05 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా…
ఓవరాల్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 4 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3 కోట్ల లోపు షేర్ ని సినిమా అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.