Home న్యూస్ 4వ రోజు జాట్ మూవీ మాస్ వీరంగం….4 డేస్ టోటల్ కలెక్షన్స్!!

4వ రోజు జాట్ మూవీ మాస్ వీరంగం….4 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

గదర్2 సినిమాతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన రికార్డులతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న సన్నీ డియోల్(Sunny Deol) నటించిన లేటెస్ట్ మూవీ జాట్(Jaat Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో…

జోరు చూపించ లేదు కానీ ఉన్నంతలో మొదటి 3 రోజుల్లో గుడ్ ట్రెండ్ ను చూపించి సన్నీ డియోల్ కి ఇప్పటికీ మంచి మార్కెట్ ఉందని అయితే నిరూపించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మొదటి రోజు కన్నా కూడా బెటర్ గా వసూళ్ళని అందుకోగా…

నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ తో అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి బిగ్గెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. మూడో రోజు ఆల్ మోస్ట్ డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా…

నాలుగో రోజు మాత్రం అంచనాలను మించి పోయి ఏకంగా 14.05 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా నాలుగు రోజులు పూర్తి అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని…

దాటేసి 40.62 కోట్ల నెట్ కలెక్షన్స్ తో నాలుగు రోజుల వీకెండ్ లో మంచి జోరుని చూపించింది. ఇక 5వ రోజున కూడా హాలిడే నే ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది. లాంగ్ రన్ లో 100 కోట్ల మార్క్ ని అందుకుంటే డీసెంట్ హిట్ గా నిలుస్తుంది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here