కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీ తెలుగులో పట్టుదల పేరుతో డబ్ అవ్వగా మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక తేరుకోలేదు అనుకున్నా కూడా తెలుగు లో దెబ్బ పడినా కూడా తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో…
అజిత్ స్టార్ పవర్ హెల్ప్ తో ఓవరాల్ గా వీకెండ్ లో మాస్ రాంపెజ్ ను చూపించింది, నాలుగో రోజు నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ను ఎక్కువగా సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ కొంచం ఎక్కువగా సొంతం చేసుకోవడంతో అనుకున్న రేంజ్ కి వెళ్ళకపోయినా ఓవరాల్ గా సినిమాకి వచ్చిన టాక్ దృశ్యా..
నాలుగో రోజును మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4వ రోజున 15 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకోగా టోటల్ గా 4 రోజుల్లో 92 లక్షల షేర్ ని 2 కోట్ల గ్రాస్ ను అందుకోగా 3 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 2.08 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక సినిమా తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ తో జోరు చూపించగా 20 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేస్తుంది అనుకున్నా కూడా అది జరగలేదు కానీ ఓవరాల్ గా 18.65 కోట్ల గ్రాస్ ను 9.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక టోటల్ గా 4 రోజుల వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
VidaaMuyarchi-Pattudala 4 Days Total WW Collections Approx
👉Tamilnadu – 63.90Cr
👉Telugu States – 2.00Cr
👉Karnataka – 8.30Cr
👉Kerala – 3.00Cr
👉ROI – 0.95Cr
👉Overseas – 37.85Cr***approx
Total WW collection – 116.00CR(56.90CR~ Share) Approx
(61% RECOVERY)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో 61% రికవరీని సాదించిన సినిమా మరో 35 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్న దాని పై సినిమా విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయో చెప్పగలం…