ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సక్సెస్ లు అందుకోవడం లో విఫలం అయిన టాలీవుడ్ కేవలం రెండు నెలల్లో ఒకే హిట్ ని దక్కించు కోగా మూడో నెలలో వచ్చిన కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా అన్ సీజన్ అయినా కానీ ఉన్నంతలో ప్రేక్షకుల మనసు గెలుచుకుని మంచి వసూళ్ళనే సాధిస్తూ దూసుకు పోతుంది.
మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 5.3 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న ఈ సినిమా నాలుగో రోజు మహా శివరాత్రి హాలిడే ని కూడా బాగా నే వాడుకుంటూ దూసుకు పోతుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రెండు షోల కి 35% లోపే డ్రాప్స్ ని సొంతం చేసుకోగా…
ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మరింత డ్రాప్స్ తగ్గి టోటల్ గా మూడో రోజు తో పోచితే 25% వరకు మాత్రమె డ్రాప్స్ ని ఓవరాల్ గా సాధించింది ఈ సినిమా. దాంతో సినిమా మరోసారి కోటి అందుకోవడం కన్ఫాం అవ్వగా ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి సినిమా నాలుగో రోజు…
1.2 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయం అంటున్నారు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి. మూడో రోజు లెవల్ లోనే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఉంటే సినిమా 1.4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది.
మొత్తం మీద మొదటి 4 రోజుల విషయం లో మరీ పెద్ద సినిమాల లెవల్ లో భీభత్సమైన కలెక్షన్స్ కాకున్నా ఉన్నంతలో అన్ సీజన్ అయినా స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Anticipating good collections to movie 118
of kalyanram