బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ జాక్(Jack Movie) సినిమాతో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా మీద డీసెంట్ అంచనాలు ఉన్నప్పటికీ కూడా అటు టాక్ కానీ ఇటు కలెక్షన్స్ కానీ ఏమాత్రం…
జోరు ని చూపించ లేక తీవ్రంగానే నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా 3 రోజుల్లో 7 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా అనుకున్న రేంజ్ లో అయితే గ్రోత్ ని చూపించడం లేదు…
ఉన్నంతలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో మరోసారి మూడో రోజుకి సిమిలర్ గా అయితే ట్రెండ్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఉండగా మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో…
ఓవరాల్ గా 70-75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే లెక్క మరికొంత పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోతున్న సినిమా..
ఓవరాల్ గా 90 లక్షల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే 1 కోటి రేంజ్ దాకా వెళ్ళే అవకాశం కొద్ది వరకు ఉంది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇవి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక టోటల్ గా 4 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.