ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవు తాయి అంటారు… టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ ఒకప్పుడు భారీ గా రెమ్యునరేషన్లు తీసుకున్నా పరాజయాలు ఎదురు అయినప్పుడు ఆ రెమ్యునరేషన్ పరంగా భారీ గా తగ్గించుకుని మళ్ళీ హిట్ల కోసం కష్ట పడతారు. మళ్ళీ హిట్లు కొట్టి రేటు పెంచడం లాంటివి కామన్ అనే చెప్పాలి. ఇప్పుడు ఓ డైరెక్టర్ పరిస్థితి కూడా ఇలానే ఉందని చెప్పొచ్చు.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు…. టాలీవుడ్ లో అంతరించిన మల్టీ స్టారర్ ట్రెండ్ ని తిరిగి మొదలు పెట్టిన శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో అందరినీ మెప్పించిన అడ్డాల తర్వాత ముకుంద తో కొందరినే మెప్పించాడు.
అయినా అడ్డాల టాలెంట్ చూసి మహేష్ బ్రహ్మోత్సవం ఆఫర్ ఇవ్వగా ఆ సినిమా కి గాను అడ్డాల 9 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడని టాక్. కానీ ఆ సినిమా డిసాస్టర్ అవ్వడం తో ఆ ఎఫెక్ట్ అడ్డాల పై గట్టిగా పడగా ఇప్పటి వరకు తన కొత్త సినిమా ను సైన్ చేయని అడ్డాల రీసెంట్ గా తన జానర్ కి…
ఏమాత్రం సూట్ కానీ అసురన్ రీమేక్ ని చేయడానికి ఓకే చెప్పాడు. కాగా ఈ సినిమా రీమేక్ కి గాను అడ్డాల రెమ్యునరేషన్ మ్యాటర్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది. కాగా ఈ సినిమాకి అడ్డాల రెమ్యునరేషన్ లేకుండా నెలకి 2 లక్షల జీతం తీసుకుంటూ పని చేయబోతున్నాడట.ఇప్పటి వరకు 12 నెలలుగా సినిమా కి పని చేస్తున్నాడు అడ్డాల… అందులో ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ లు కూడా ఉన్నప్పటికీ కూడా…..
అదే రెమ్యునరేషన్ ని తీసుకున్నారని ఇండస్ట్రీ లో టాక్ ఉంది… మొత్తం మీద ఒకప్పుడు 9 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుని ఇప్పుడు 2 లక్షల కే పరిమితం కానున్నాడు అడ్డాల. సినిమా హిట్ అయితే మళ్ళీ అడ్డాల జోరు పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా పరిస్థితులు నార్మల్ అయ్యాక సినిమా రిలీజ్ ను సొంతం చేసుకుంటుందని అంటున్నారు.