Home న్యూస్ అక్షరాలా 5000 కోట్లు…అయినా ఆ సినిమా దరిదాపుల్లో లేని అవతార్2!

అక్షరాలా 5000 కోట్లు…అయినా ఆ సినిమా దరిదాపుల్లో లేని అవతార్2!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున అంచనాలతో బరిలోకి దిగిన అవతార్2 సినిమా మరీ ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో మెప్పించక పోయినా పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకోగా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేసినా టోటల్ ఇండియాలో మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది ఈ సినిమా. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు…

Avatar2 2 Days Telugu States Collections!

మొదటి వారానికి గాను 600 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి ఆప్టే అక్షరాలా 5000 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కానీ ఈ కలెక్షన్స్ హాలీవుడ్ లో ఓపెనింగ్స్ లో ఆల్ టైం…

Avatar2 1st Week (7 Days) Telugu States Collections!

రికార్డులను క్రియేట్ చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాతో పోల్చితే దరిదాపుల్లో కూడా లేక పోవడం విచారకం అనే చెప్పాలి. ప్రీ కోవిడ్ టైం లో అవెంజర్స్ ఎండ్ గేమ్ మొదటి వారంలో 1.48 బిలియన్ డాలర్స్ ను అందుకుంది. కోవిడ్ తర్వాత స్పైడర్ మాన్ నో వే హోమ్ 1.2 బిలియన్ డాలర్స్ ను అందుకుంది…

Hollywood Movies Top 10 1st Day Collection In India

కానీ వీటితో పోల్చితే అవతార్ 2 సినిమా ఏ సినిమా కి దరిదాపుల్లో కూడా లేదనే చెప్పాలి. ఇంతటి క్రేజ్ నడుమ వచ్చిన సినిమా మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేక పోయినా మంచి జోరుని చూపిస్తుంది అనుకుంటే చాలా తక్కువ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. కానీ రెండో వీక్ లో క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ ఉండటంతో సినిమా తిరిగి జోరు అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Avatar2 6 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here