Home న్యూస్ AP-TG లో చరిత్ర సృష్టించిన పఠాన్….హిస్టారికల్ రికార్డ్!!

AP-TG లో చరిత్ర సృష్టించిన పఠాన్….హిస్టారికల్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 4 ఏళ్లకి వెండితెరపై కంబ్యాక్ ఇచ్చిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. సినిమా బాలీవుడ్ మూవీస్ లో సరికొత్త ఇండస్ట్రీ హిట్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించగా రిలీజ్ అయ్యి నెల అయిపోయాక కూడా ఇప్పటికీ కొత్త సినిమాలతో పోల్చితే మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ…

పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సృష్టించింది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ మూవీ కూడా తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటలేదు… కానీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన…

బ్రహ్మాస్త్ర సినిమా 30.60 కోట్ల గ్రాస్ ను అన్ని వర్షన్స్ కలుపుకుని సొంతం చేసుకోగా ఇప్పుడు పఠాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి 35,40,45 కాదు ఏకంగా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా దాటేసి ఆల్ మోస్ట్ 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో వసూల్ చేసింది.

ఇందులో సగానికి -పైగా కలెక్షన్స్ ఒక్క నైజాం ఏరియా నుండే రావడం విశేషం అని చెప్పాలి….ఓ హిందీ మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోవడం ఇక్కడ షారుఖ్ కి ఉన్న క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here