Home న్యూస్ 5 డేస్ SRK డంకి టోటల్ కలెక్షన్స్….జోరు పెరిగిందిగా!!

5 డేస్ SRK డంకి టోటల్ కలెక్షన్స్….జోరు పెరిగిందిగా!!

0

బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన లేటెస్ట్ మూవీ డంకి(Dunki Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ను అయితే సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా అయితే మరీ జోరు అయితే పెంచడం లేదు కానీ ఉన్నంతలో క్లాష్ లో…

ఈ సినిమా జానర్ అండ్ ప్రజెంట్ టాక్ దృశ్యా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు క్రిస్టమస్ హాలిడే లభించడంతో ఓవరాల్ గా 23.50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 5 రోజుల నెట్ కలెక్షన్స్ లెక్క…

127 కోట్లకు రేంజ్ లో ఉండగా గ్రాస్ 160 కోట్ల దాకా ఉంది… ఇక ఓవర్సీస్ లో సినిమా 95 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా 255 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…. ఈ కలెక్షన్స్ షారుఖ్ ఖాన్ నటించిన ప్రీవియస్ 2 మూవీస్ కలెక్షన్స్ తో పోల్చితే…

అసలు ఏమాత్రం మ్యాచ్ అయ్యేలా లేవు, అలాగే షారుఖ్ అండ్ రాజ్ కుమార్ హిరాణిల కాంబో హైప్ కి కూడా తగ్గ కలెక్షన్స్ కావు కానీ సినిమా జానర్ అండ్ ప్రజెంట్ పోటిలో వచ్చిన టాక్ దృశ్యా బాగానే హోల్డ్ ని చూపిస్తుంది. ఇక న్యూ ఇయర్ వీకెండ్ లో సినిమా ఉన్నంతలో డీసెంట్ ట్రెండ్ ను చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here