బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం గదర్2 సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించిన లేటెస్ట్ మూవీ జాట్(Jaat Movie) సినిమా తో కెరీర్ లో సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్ మాస్ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవ్వగా 4 డేస్ లాంగ్ వీకెండ్ లో 40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమా 5వ రోజు కూడా పార్షిక హాలిడే అడ్వాంటేజ్…
లభించడంతో హిందీలో రెండో రోజు కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేసింది. రెండో రోజు 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 5వ రోజుకి వచ్చేసరికి 7.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది.
ఇక టోటల్ గా సినిమా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 48 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున ఫుల్ వర్కింగ్ డే లో ఎంటర్ అయినా కూడా….
మేజర్ మల్టీప్లెక్సులలో 99 టికెట్ రేట్ ఆఫర్ పెట్టడంతో టికెట్ సేల్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా మరోసారి సినిమా 5 కోట్ల రేంజ్ కి తగ్గని నెట్ కలెక్షన్స్ ని 6వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఆల్ మోస్ట్ 6 రోజుల్లో సగం టార్గెట్ ను కంప్లీట్ చేసుకున్న….
జాట్ మూవీ మిగిలిన రన్ లో పెద్దగా పోటి ఏమి లేక పోవడంతో సూపర్ స్ట్రాంగ్ గా ఇదే జోరుని కొనసాగిస్తే 100 కోట్ల టార్గెట్ ను లాంగ్ రన్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.