బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్టమస్ వీకెండ్ లో కన్నడ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి వచ్చిన కిచ్చా సుదీప్(Kichcha Sudeep) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మాక్స్(Max The Movie) అక్కడ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకోగా ఇక్కడ మాత్రం రెస్పాన్స్ మిక్సుడ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఎక్స్ లెంట్ గానే జోరు చూపించి లాంగ్ వీకెండ్ లో మంచి జోరుతో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక తెలుగు లో మాత్రం సినిమా మొదటి రోజు 35 లక్షలు, రెండో రోజు 40 లక్షలు మూడో రోజు 45 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….
దాంతో టోటల్ గా 3 రోజుల వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…షేర్ అటూ ఇటూగా 60 లక్షల వరకు ఉంటుందని అంచనా…తెలుగులో డీసెంట్ హిట్ కోసం సినిమా 2 కోట్లకు పైగానే షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక కర్ణాటక లో మాత్రం సండే రోజున మంచి జోరుని చూపించిన సినిమా ఓవరాల్ గా 5 రోజుల్లో కర్ణాటకాలో 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా ఓవర్సీస్ లో లిమిటెడ్ లోకేషన్స్ లో ఓకే అనిపించింది….
దాంతో టోటల్ గా సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Max The Movie 5 Days Total World Wide Collections Approx.
👉Karnataka – 32.05Cr
👉Telugu States – 1.20Cr(3 Days)
👉ROI – 0.50Cr
👉Overseas – 1.15Cr***approx.
Total WW collection – 34.90CR(17.25CR~ Share) Approx
మొత్తం మీద వీకెండ్ లో సినిమా ఓవరాల్ గా మంచి జోరునే చూపించింది….టాక్ యునానిమస్ గా వచ్చి ఉంటే మరింత రచ్చ చేసి ఉండేది సినిమా…మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఇంకా సగం రికవరీని దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.