Home న్యూస్ 5 డేస్ విరూపాక్ష టోటల్ కలెక్షన్స్….మాస్ భీభత్సం ఇది!!

5 డేస్ విరూపాక్ష టోటల్ కలెక్షన్స్….మాస్ భీభత్సం ఇది!!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజు కూడా మరోసారి మంచి జోరుని చూపించి సాలిడ్ కలెక్షన్స్ ని దక్కించుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ అంచనాలకు దగ్గర అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

సినిమా 5వ రోజు మొత్తం మీద 2.4 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా అనుకున్నట్లే సినిమా 2.4 కోట్ల దాకా షేర్ ని 5వ రోజున సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 3.32 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం.

Virupaksha 5 Days Total Collections!

దాంతో టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 9.56Cr
👉Ceeded: 3.16Cr
👉UA: 2.78Cr
👉East: 1.51Cr
👉West: 1.08Cr
👉Guntur: 1.52Cr
👉Krishna: 1.44Cr
👉Nellore: 72L
AP-TG Total:- 21.77CR(37.25CR~ Gross)
👉KA+ROI – 1.95Cr
👉OS – 3.95Cr
Total World Wide – 27.67CR(49.60CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మీద ఏకంగా 4.67 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Virupaksha 4 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here