Home న్యూస్ అక్షరాలా 125 కోట్లు+…మచ్చలపులి భీభత్సం!

అక్షరాలా 125 కోట్లు+…మచ్చలపులి భీభత్సం!

0

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ వసూళ్లతో దూసుకుపోతుంది… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులలోనే టోటల్ గా 72 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 120 కోట్ల దాకా గ్రాస్ ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక 6 వ రోజున కూడా సినిమా జోరు రెండు రాష్ట్రాలలో బాగానే కొనసాగింది అని చెప్పొచ్చు.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ కొద్దిగా తగ్గినా ఈవినింగ్ షోల లో జోరు చూడటం తో సినిమా రోజుని ఘనంగానే ముగించింది.. మొత్తం మీద 6 వ రోజు షేర్ మరియు గ్రాస్ వివరాలు తెలియాల్సి ఉండగా ఓవరాల్ గా గ్రాస్ మాత్రం 5 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 6 రోజుల్లో 125 కోట్ల గ్రాస్ మార్క్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. ఇక 7 వ రోజు నుండి ఆదివారం వరకు వరుసగా హాలిడేస్ ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర అరవింద సమేత జోరు ఇలాగే కొనసాగే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here