Home న్యూస్ 6 వ రోజు కలెక్షన్స్…. సామి కొట్టాడు!

6 వ రోజు కలెక్షన్స్…. సామి కొట్టాడు!

0

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబో లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజుల్లో రికార్డ్ లెవల్ లో 72.2 కోట్ల షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి 5 వ రోజు తో పోల్చితే 15% వరకు ఓవరాల్ డ్రాప్స్ వచ్చిన విషయం తెలిసిందే.

కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల విషయం లో మాత్రం సినిమా బాగానే హోల్డ్ చేసి కొన్ని ఏరియాల్లో మంచి గ్రోత్ ని సాధించి సత్తా చాటింది…నైజాం లో కూడా సినిమా ఈవినింగ్ షోల కి 5% కి పైగా గ్రోత్ కనిపించగా ఆంధ్రా సీడెడ్ లో గ్రోత్ మరింత ఎక్కువ ఉంది.

ఓవరాల్ గా సినిమా 6 వ రోజు ఇప్పుడు 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది… అన్నీ అనుకున్నట్లు జరిగితే నైట్ షోల గ్రోత్ కొన్ని ఏరియాల్లో మరింతగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఓవరాల్ గా 3 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి… మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here