అఖిల్ అక్కినేని 4 వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా కి 5 వ రోజు హాలిడే కలిసి రావడం తో తక్కువ డ్రాప్స్ తో మంచి హోల్డ్ ని సొంతం చేసుకుంది కానీ తర్వాత రోజు కంప్లీట్ వర్కింగ్ డే అవ్వడం తో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై గట్టిగానే పడింది, ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ బాగానే ఉన్నా థియేటర్స్ దగ్గర బుకింగ్స్…
తగ్గడంతో ఓవరాల్ గా డ్రాప్స్ అనుకున్న దానికన్నాఎక్కువ రావడం జరిగింది. మొత్తం మీద సినిమా 5 వ రోజు 1.31 కోట్ల షేర్ ని అందుకుంటే 6 వ రోజు డ్రాప్స్ వలన 60-70 లక్షలు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 80 లక్షల రేంజ్ కి వెళుతుంది అనుకుంటే సినిమా…
మొత్తం మీద 6 వ రోజున 57 లక్షల రేంజ్ షేర్ తో సరిపెట్టుకుంది. ఇక ఓవర్సీస్ లో అమెరికాలో సినిమా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అధిగమించి అక్కడ మంచి లాభాలను సొంతం చేసుకుంది, ఇప్పటికే ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అవ్వడం తో ఇప్పుడు డ్రాప్స్ ఉన్నా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదని చెప్పొచ్చు.
ఇక సినిమా 6 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.86Cr
👉Ceeded: 3.64Cr
👉UA: 2.13Cr
👉East: 1.07Cr
👉West: 87L
👉Guntur: 1.23Cr
👉Krishna: 96L
👉Nellore: 73L
AP-TG Total:- 17.49CR(28.85CR Gross)
Ka+ROI: 1.24Cr
OS – 2.22Cr
Total WW: 20.95CR(34.9CR~ Gross)
ఇదీ సినిమా 6 రోజుల కలెక్షన్స్ లెక్క…
సినిమాను ఓన్ రిలీజ్ కాకుండా 18.5 కోట్లకు అమ్మగా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మీద సినిమా 1.95 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు మొదటి వారాన్ని సాలిడ్ ప్రాఫిట్స్ తో ముగించడానికి సిద్ధం అవుతుంది, ఇక 7 వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సాధిస్తుందో చూడాలి.