పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీ సలార్(Salaar part 1 – ceasefire) భారీ అంచనాల నడుమ లాస్ట్ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అవ్వగా సినిమా అంచనాలను అందుకున్నా కూడా భారీ పోటిలో ఓవరాల్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరదాకా వచ్చి బ్రేక్ ఈవెన్ ని మిస్ చేసుకుంది….టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
630 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 337.43 కోట్ల షేర్ ని అందుకుని మైనస్ లాస్ తో పరుగును పూర్తి చేసుకుంది. తర్వాత డిజిటల్ లో సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సలార్ మూవీ మంచి ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని రీసెంట్ గా…
స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయింది….దాంతో టి.ఆర్.పి రేటింగ్ సాలిడ్ గా సొంతం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు…కానీ ఇప్పుడు సినిమా టి.ఆర్.పి రేటింగ్ మాత్రం సినిమా మీద ఉన్న హైప్ అండ్ ప్రమోషన్స్ దృశ్యా చూసుకుంటే మైండ్ బ్లాంక్ చేసే రేటింగ్ నే సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు స్టార్ మా ఛానెల్ లో సినిమాకి 6.5 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది సలార్ మూవీ….రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన సినిమాలలో ఇది వన్ ఆఫ్ ది లోవేస్ట్ రేటింగ్ లలో ఒకటి అని చెప్పాలి….
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి డిజిటల్ లో కూడా మంచి వ్యూవర్ షిప్ ను అందుకున్నా కూడా టెలివిజన్ లో మాత్రం సలార్ మూవీ టి.ఆర్.పి రేటింగ్ పరంగా మాత్రం నిరాశ పరిచింది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో టెలివిజన్ లో ఎలాంటి హోల్డ్ ని చూపించి టి.ఆర్.పి రేటింగ్ పరంగా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి.