చేసింది తక్కువ సినిమాలే అయినా హిందీ డబ్బింగ్ మూవీస్ తో సాలిడ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న యాక్టర్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ట్రాక్ రికార్డ్ అద్బుతంగా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్లకి మొదటి క్లీన్ హిట్ సినిమాను సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా తర్వాత అల్లుడు అదుర్స్ సినిమా తో ఈ ఇయర్ సంక్రాంతికి ఆడియన్స్ ను పలకరించగా తర్వాత…
మూవీస్ కోసం రీమేక్ లను ఎంచుకోగా ఒకటి ఛత్రపతి రీమేక్ మరోటి కర్ణన్ రీమేక్ లను ఎంచుకున్నాడు. బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి సెట్స్ పైకి కూడా తీసుకువెళ్ళారు. ఈ సినిమాను బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన…
పెన్ స్టూడియోస్ వాళ్ళు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొంచం స్లో అయినా అప్ కమింగ్ మూవీస్ ని సాలిడ్ గా ప్లాన్ చేసుకున్న పెన్ స్టూడియోస్ వాళ్ళు రీసెంట్ గా తమ అప్ కమింగ్ మూవీస్ లిస్టు ని రిలీజ్ చేశారు. ఆ మూవీస్ లిస్టులో మొత్తం మీద….
5 సినిమాలను అనౌన్స్ చేశారు… అక్షయ్ కుమార్ తో బెల్ బాటం, ఇండియన్ మోస్ట్ వాంటెడ్ ఆర్ ఆర్ ఆర్, జాన్ అబ్రహం అటాక్, ఆలియా భట్ గంగుభాయ్ మరియు శంకర్ తో అపరిచితుడు హిందీ రీమేక్ లను అనౌన్స్ చేయగా ప్రస్తుతం సెట్స్ మీదకి వెళ్ళిన 80 కోట్ల ఖర్చుతో అనౌన్స్ చేసిన ఛత్రపతి రీమేక్ ని మాత్రం లిస్టు లో చేర్చలేదు.
కారణాలు ఏంటో తెలియదు ఈ సినిమా కోసం సెట్స్ కూడా ఏర్పాటు చేశారు కానీ పెన్ వాళ్ళు అనౌన్స్ చేసిన అప్ కమింగ్ మూవీస్ లిస్టు లో సినిమా లేక పోవడం తో ఈ రీమేక్ అసలు ఉందా లేదా అన్న డౌట్ ఇప్పుడు నెలకొంది. బెల్లంకొండ కూడా ఈ రీమేక్ ప్లేస్ లో ఇప్పుడు కర్ణన్ రీమేక్ ని మొదలు పెట్టే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.