Home న్యూస్ 8 లక్షలకు అమ్మితే టోటల్ గా వచ్చింది ఇది…జాక్ పాట్ అంటే ఇదే!!

8 లక్షలకు అమ్మితే టోటల్ గా వచ్చింది ఇది…జాక్ పాట్ అంటే ఇదే!!

0

సెకెండ్ వేవ్ తర్వాత ఇండియన్ మూవీస్ లో మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా డాక్టర్… శివ్వ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యే టైం లో తెలుగు లో పెద్దగా అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ అవ్వడంతో రెట్టించిన జోరు తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సినిమా…

కొత్త సినిమాలు వస్తూనే ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎక్కడా తగ్గలేదు, టోటల్ రన్ లో ఎవ్వరూ ఊహించని లాభాలు కూడా సొంతం అవ్వగా తెలుగు లో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో మలయాళంలో కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది ఈ సినిమా…

మలయాళంలో సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ అయిన తర్వాత రిలీజ్ కి సిద్ధంగా సినిమాలు ఏమి లేక పోవడంతో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అన్న డౌట్ అలాగే సినిమా ఆల్ రెడీ రిలీజ్ అయ్యి 3 వారాలు అవ్వడంతో రెస్పాన్స్ ఎలా ఉంటుందో అన్న డౌట్ లో…

సినిమాను పబ్లిసిటీ ఖర్చులు కాకుండా 8 లక్షలు మాత్రమే చెల్లించి హక్కులను అమ్మారు… లిమిటెడ్ రిలీజ్ నే సినిమా అక్కడ సొంతం చేసుకున్నా ఫస్ట్ డే నే ఆ రేటు ని రికవరీ చేసి లాభాల బాట పట్టిన ఈ సినిమా దీపావళి మూవీస్ వచ్చే వరకు జోరు చూపి రీసెంట్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది.

సినిమా టోటల్ రన్ లో కేరళలో 1.58 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… అందులో షేర్ ఆల్ మోస్ట్ 75 లక్షల దాకా ఉంటుందని చెప్పొచ్చు. పెట్టిన 8 లక్షలు పోను ఆల్ మోస్ట్ 67 లక్షల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా, జాక్ పాట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. 100 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న సినిమా ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here