Home న్యూస్ 9.35CR నుండి 75L…..మైండ్ బ్లాంక్ సామి ఇదీ!!

9.35CR నుండి 75L…..మైండ్ బ్లాంక్ సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించడం అన్నది చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యం అవుతుంది, అలా సాధ్యం అయిన వాళ్ళలో మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అయిన పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) ఒకరు….మొదటి సినిమా ఉప్పెన(Uppena Movie) సంచలనం సృష్టించిన తర్వాత…

తన అప్ కమింగ్ మూవీస్ మీద భారీగా అంచనాలు పెరిగి పోగా ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో సినిమాలను చేయలేక పోతున్న వైష్ణవ్ తేజ్ వరుస ఫ్లాఫ్స్ తర్వాత ఇప్పుడు ఆదికేశవ(Aadikeshava Movie) తో ఆడియన్స్ ముందుకు రాగా ఈ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది ఇప్పుడు…

కాగా ఉప్పెనతో మొదటి సినిమాతోనే ఏకంగా మొదటి రోజున 9.35 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న వైష్ణవ్ తేజ్ తర్వాత రెండో సినిమా కొండ పొలంతో 1.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మూడో సినిమా రంగ రంగ వైభవంగా సినిమా తో మొదటి రోజున 96 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్నాడు…

ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదికేశవ సినిమా మొదటి రోజు కేవలం 75 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా తన కెరీర్ లో చేసిన సినిమాల్లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఓవరాల్ గా కెరీర్ ని రికార్డ్ లెవల్ లో స్టార్ట్ చేసి ఇప్పుడు లోవేస్ట్ ఫేజ్ కి వచ్చాడు… ఇక తన అప్ కమింగ్ మూవీస్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఎలా ఇస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here