Home న్యూస్ 3 డేస్ ఆదికేశవ టోటల్ కలెక్షన్స్…ఇవి సరిపోవు సామి!

3 డేస్ ఆదికేశవ టోటల్ కలెక్షన్స్…ఇవి సరిపోవు సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ(AadiKeshava) మూవీ మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఏ దశలో కూడా జోరుని చూపించలేక పోయిన సినిమా  వీకెండ్ ని నిరాశ పరిచే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2వ రోజు 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా పెద్దగా జోరు ఏమి చూపించలేక పోయిన ఆదికేశవ ఇప్పుడు మూడో రోజు 36 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది.

సినిమా వరల్డ్ వైడ్ గా 42 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా దూరం సినిమా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. టోటల్ గా సినిమా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు 2.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.

ఓవరాల్ గా సినిమా 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 9 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 7 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు చూపించిన డ్రాప్స్ తో ఇక తేరుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి ఇప్పుడు. ఇక ఆదికేశవ సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వడంతో ఈ రోజు నుండి ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here