రిలీజ్ అయిన రోజు నుండి రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ మొదటి వారంలో సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) రెండో వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉంది.
కానీ 8 రోజుల నాన్ స్టాప్ జాతరలో 7-8 రోజులు వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన తర్వాత 9వ రోజున ఫుల్ వర్కింగ్ డే లో కొంచం డ్రాప్స్ ఎక్కువగా అనిపిస్తున్నా కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మరోసారి డామినేట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.
మొత్తం మీద కోస్టల్ ఆంధ్రలో సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ రోజు నైజాం లో కొంచం డ్రాప్స్ ఎక్కువగా కనిపించినా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే… తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే..
అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 3.2 కోట్లు ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.. 3.5 దాకా కనుక పోతే సినిమా ఊరమాస్ హోల్డ్ ని చూపించింది అని చెప్పొచ్చు. ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా…
మరియు ఓవర్సీస్ లో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 3.8-4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూ గా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
మొత్తం మీద ఊరమాస్ హోల్డ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ వీకెండ్ లో తిరిగి మాస్ బ్యాటింగ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.