బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ(Akhanda) కన్నా ముందు వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఈ అఖండతో సాలిడ్ గా కంబ్యాక్ ను సొంతం చేసుకున్న తర్వాత ఈ ఇయర్ బాక్ టు బాక్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకు రాగా…
వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమాతో మిక్సుడ్ రెస్పాన్స్ తో తన కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేయగా ఇప్పుడు ఈ ఇయర్ రెండో రిలీజ్ అయిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ఆడియన్స్ బాగా మెప్పించిన సినిమా….
కలెక్షన్స్ పరంగా స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా మంచి కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించగా సినిమా 12వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 115 కోట్ల నుండి 116 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని పూర్తి చేసుకోగా 2023 ఇయర్ లో…
బాలయ్య నటించిన 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 250 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు, తన కెరీర్ లోనే ఈ ఇయర్ ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేశాడని చెప్పొచ్చు.
కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మరికొంత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇలానే స్టడీ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…