Home న్యూస్ ఇదో కొత్త రికార్డ్….27.2M తో అజిత్ ఫ్యాన్స్ బిగ్గెస్ట్ రికార్డ్!

ఇదో కొత్త రికార్డ్….27.2M తో అజిత్ ఫ్యాన్స్ బిగ్గెస్ట్ రికార్డ్!

0

సోషల్ మీడియాలో సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఏదైనా చేయోచ్చు….సినిమాల సాంగ్స్, టీసర్ అండ్ ట్రైలర్ లు ప్రమోషన్ కి పని చేస్తూ ఉంటాయి. వాటితో పాటు సినిమాల ఫస్ట్ లుక్ లు, టైటిల్ పోస్ట్ లు లాంటివి కూడా ప్రమోషన్స్ లో భాగం అవుతూ ఉండగా రీసెంట్ గా ట్విట్టర్ లో సినిమాల ఫస్ట్ లుక్ లకు…

ఒక టైంలో ఎన్ని ట్వీట్స్ పడ్డాయి…ఎన్ని లైక్స్ వచ్చాయి లాంటివి ఆసక్తిగా మారగా ఆ ట్రెండ్ ఒక టైం తర్వాత ఆగిపోయాయి. కానీ లేటెస్ట్ గా కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్ట్ కి సోషల్ మీడియాలో వచ్చిన రీచ్ సాలిడ్ గా ఉందని చెప్పాలి….

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ కొత్త సినిమా అఫీషియల్ టైటిల్ ను రీసెంట్ గా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కి 24 గంటల్లో రికార్డ్ లెవల్ లో ఇంప్రెషన్స్ సొంతం అయ్యాయని, ఇది ఆల్ టైం రికార్డ్ అని పోస్టర్ ను రిలీజ్ చేశారు…సినిమాకి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) అంటూ టైటిల్ ను కన్ఫాం చేశారు…

ఇలా కన్ఫాం చేశారో లేదో సోషల్ మీడియాలో ఈ టైటిల్ వైరల్ అవ్వగా అనౌన్స్ చేసిన పోస్టర్ కి 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఏకంగా 27.2 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి. ట్విట్టర్ లో ఏ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్ట్ కి ఇది రికార్డ్ రీచ్ అని అంటున్నారు…. మరి ఈ కొత్త రికార్డ్ ను ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమాలు బ్రేక్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here