Home న్యూస్ అక్షరాలా 300 కోట్ల షేర్ ఔట్….3 నెలల కరువు తీర్చిన రెబలోడు!

అక్షరాలా 300 కోట్ల షేర్ ఔట్….3 నెలల కరువు తీర్చిన రెబలోడు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ టాలీవుడ్ కి అల్టిమేట్ స్టార్ట్ అయితే లభించింది…తర్వాత సమ్మర్ కి ముందు ఓ భారీ బ్లాక్ బస్టర్ పడింది…కానీ తర్వాత చూసుకుంటే ఆల్ మోస్ట్ 3 నెలలు కంప్లీట్ గా డ్రై సీజన్ గా మిగిలిపోయింది. నోటబుల్ పెద్ద సినిమాలు లేక పోవడం, రిలీజ్ అయిన చిన్న చితకా సినిమాలు అతి కష్టం మీద బిజినెస్ ను కూడా…

రికవరీ చేసుకోవడానికి కష్టపడుతూ IPL, ఎలక్షన్స్ అన్నీ గట్టి ఇంపాక్ట్ కొట్టి 3 నెలలు కంప్లీట్ గా డ్రై సీజన్ గా మారిపోయిన తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ….

అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 5 రోజులు పూర్తి అయ్యే టైంకే వాల్యూ బిజినెస్ లో 80% వరకు రికవరీని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….ఇక సినిమా 6వ రోజు సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా ఇప్పుడు అక్షరాలా 300 కోట్ల షేర్ మార్క్ ని…

దాటేసి ఈ ఇయర్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఫస్ట్ 300 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న మూవీగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. అలాగే ఒక పక్క ఇతర ఇండస్ట్రీ మూవీస్ ఎంతో కొంత జోరు చూపిస్తున్న టైంలో రేసులో పూర్తిగా వెనకబడిన టాలీవుడ్ కి…

ఊపిరి పోసిన కల్కి మూవీ అన్ సీజన్ కి ఎండ్ కార్డ్ వేసి ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి 3 నెలల కరువు తీర్చింది…. ఓవరాల్ గా లాస్ట్ 7 నెలలలో రెండు సార్లు ప్రభాస్ 300 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి టాలీవుడ్ తరుపున ఈ రికార్డ్ కొట్టిన ఒకే ఒక్కడిగా నిలిచాడు….

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్న కల్కి మూవీ ఇప్పుడు రెండో వీక్ లో అసలు పోటినే లేక పోవడంతో ఇదే జోరుని కొనసాగిస్తే లాంగ్ రన్ లో పాన్ ఇండియా మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటి గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here