కోలివుడ్ లో ప్రస్తుతం ఎవ్వరూ టచ్ కూడా చేయలేని రేంజ్ క్రేజ్ తో దూసుకు పోతున్నాడు దళపతి విజయ్(Thalapathy Vijay) రీసెంట్ టైంలో ప్రతీ సినిమాకి మిక్సుడ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అన్ని సినిమాలు ఒకటికి మించి ఒకటి దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా వచ్చిన….
ది గోట్ మూవీ సైతం మిక్సుడ్ టాక్ తోనే 450 కోట్లకు పైగా కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది…ఇక ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ సినీ కెరీర్ లో లాస్ట్ మూవీగా చేస్తున్న దళపతి 69వ సినిమా త్వరలో మొదలు కాబోతుంది….ఆ సినిమా తర్వాత పూర్తి టైంను….
పాలిటిక్స్ కే కేటాయించబోతూ ఉండగా ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉండాలని, అదే టైంలో మినిమమ్ గ్యారెంటీ అనిపించే కంటెంట్ కావాలని చూస్తున్న విజయ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైంలో రిలీజ్ అయిన…
నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా రీమేక్ చేస్తున్నారని వార్తలు గత కొంత టైంగా ఇటు టాలీవుడ్ లో అటు కోలివుడ్ లో చక్కర్లు కొడుతూ ఉండగా….కొంత టైం ఈ వార్తలు అబద్దాలు అనే యూనిట్ వర్గాల నుండి…
టాక్ వచ్చినా కూడా ఇప్పుడు ఆల్ మోస్ట్ రీమేక్ కన్ఫాం అనిపించేలా న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. విజయ్ లాస్ట్ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తున్న KVN నిర్మాణ సంస్థ అఫీషియల్ గానే భగవంత్ కేసరి రీమేక్ రైట్స్ ను తీసుకున్నారని తెలుస్తుంది….
దాంతో పాటు సినిమా కాస్ట్ కూడా ఆల్ మోస్ట్ భగవంత్ కేసరి సినిమాలో ఉన్నట్లే అనిపిస్తుంది….శ్రీలీల రోల్ లో ఇక్కడ ప్రేమలు ఫేమ్ మమిత బైజు, కాజల్ అగర్వాల్ ప్లేస్ లో ఇక్కడ పూజ హెగ్డే, అర్జున్ రాంపాల్ ప్లేస్ లో బాబీ డియోల్ ఇలా సరిగ్గా మ్యాచ్ అయ్యేలానే స్టార్ కాస్ట్ ఉంది….
దాంతో ఆల్ మోస్ట్ రీమేక్ కన్ఫాం అనిపించేలానే ఉంది, కానీ భగవంత్ కేసరి సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వర్షన్ తో పాటు సౌత్ ఇతర డబ్ వర్షన్ లు కూడా అందుబాటులోనే ఉండటంతో ఇప్పుడు అందరూ ఎగబడి సినిమాను చూస్తున్నారు…
దళపతి విజయ్ కెరీర్ లో లాస్ట్ మూవీగా సేఫ్ జోన్ లో ఉండటానికి ఈ రీమేక్ ని ఎంచుకున్నా కూడా మెయిన్ పాయింట్ ను తీసుకుని కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ట్రీట్ మెంట్ వేరుగా ప్లాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది…మరి ఇది ఆల్ మోస్ట్ కన్ఫామో కాదో అన్నది టీం క్లారిటీ అఫీషియల్ గా ఇవ్వాల్సి ఉంది.