బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోల పరంగా భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీస్ లో రెండేళ్ళ క్రితం వచ్చిన అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటించిన ఏజెంట్(Agent Movie) ఒకటి…అప్పట్లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సాలిడ్ అంచనాల నడుమ సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే అంచనాలను…..
అందుకోవడంలో విఫలం అయ్యి ఏమాత్రం జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. సినిమా ఆల్ మోస్ట్ 80 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందగా బాక్స్ ఆఫీస్ దగ్గర 37 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…
బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో కేవలం 7 కోట్ల లోపే షేర్ ని సొంతం చేసుకుని ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను బడ్జెట్ పరంగా సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత డిజిటల్ రిలీజ్ త్వరగా అయినా నష్టాలను తగ్గించుకుంటుంది అనుకున్నా కూడా…
సినిమా ఎప్పటి కప్పుడు డిజిటల్ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమా అలా ఏడాదికి పైగా డిలే అవ్వగా ఇప్పుడు ఆల్ మోస్ట్ 2 ఏళ్ల గ్యాప్ లోపు టైం తీసుకుని ఎట్టకేలకు ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది…సినిమా రిలీజ్ అయిన ఆల్ మోస్ట్…
685 రోజుల టైం తర్వాత ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది….సోని లివ్ యాప్ లో సినిమా మార్చ్ 14 న డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది…అంటే ఆల్ మోస్ట్ 685 రోజుల తర్వాత ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ డిజిటల్ రిలీజ్ కి ఇప్పుడు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.