Home న్యూస్ “సూర్యకాంతం” స్మాల్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

“సూర్యకాంతం” స్మాల్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

     మెగా డాటర్ నిహారికా కొణిదెల హీరోయిన్ గా నటించిన మూడో సినిమా సూర్య కాంతం, బాక్స్ ఆఫీస్ దగ్గర వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పోటిగా రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ తో అయినా హీరోయిన్ గా తొలి సక్సెస్ ని సొంతం చేసు కోవాలి అని భావించిన నిహారికా ఎంత వరకు సక్సెస్ అయ్యిందో తెలియాలి అంటే సినిమా షార్ట్ రివ్యూ లో కి ఎంటర్ అవ్వాల్సిందే.

కథ: హీరో పెళ్లి చూపులకు తన పేరెంట్స్ తో వెళతాడు, అక్కడ సెకెండ్ హీరోయిన్ ని చూసి ఇష్టపడి పెళ్లి కి ఒకే చెప్పగా తర్వాత సుహాసిని కూతురు అయిన నిహారికా హీరో లైఫ్ లో ఎంటర్ అవుతుంది, ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమించు కున్న వీళ్ళు కొన్ని కారణాల వల్ల విడిపోతారు.

Niharika "Suryakantham" Pre Release Busienss - Box office Target
Niharika “Suryakantham” Pre Release Busienss – Box office Target

ఈ ట్రైయాంగిల్ లవ్ స్టొరీ ఫైనల్ గా ఎలా ముగిసింది అన్నది సినిమా స్టొరీ పాయింట్, తొలి రెండు సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో నిహారికా ఫుల్ ఎనర్జీ తో మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుని మంచి మార్కులే వేయించుకుంది, మిగిలిన పాత్రలు అన్నీ జస్ట్ పర్వాలేదు అనిపించేవిగా ఉంటాయి.

ప్లస్ పాయింట్స్:
*నిహారిక పెర్ఫార్మెన్స్
* ఎంటర్టైనింగ్ ఫస్టాఫ్
* క్లిమాక్స్
ఇవీ మొత్తం మీద సూర్య కాంతం సినిమా లో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్, ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మైనస్ పాయింట్స్
*లాగ్ ఎక్కువ అవ్వడం
*సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్
* ప్రిడిక్టబుల్ స్టొరీ లైన్… ఇవి మొత్తం మీద మైనస్ పాయింట్స్

సినిమా లో కొన్ని ఆకట్టుకునే అంశాలు ఉన్నా ఫుల్ ఎంటర్ టైనర్ మాత్రం కాదు, సెకెండ్ ఆఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచం వీక్ గా ఉండగా క్లైమాక్స్ బాగున్నా ఓవరాల్ గా థియేటర్ నుండి బయటికి వచ్చేటప్పుడు బాగుంది కానీ ఇంకొంచం బాగుంటే బాగుణ్ణు అన్న ఫీలింగ్ తో బయటికి వస్తాం.

నిహారిక పెర్ఫార్మెన్స్ కోసం, లైట్ హార్టెడ్ కామెడీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమా కి వెళ్ళొచ్చు, కథ కొత్తగా ఉండాలి కథనం అద్బుతంగా ఉండాలి అంటే ఈ సినిమా మీకోసం కాదు, సినిమా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here