Home న్యూస్ రివ్యూలు వీక్…కలెక్షన్స్ పీక్స్…ప్రేక్షకులు మారుతున్నారు

రివ్యూలు వీక్…కలెక్షన్స్ పీక్స్…ప్రేక్షకులు మారుతున్నారు

0

తెలుగు సినిమా ఆడియన్స్ మారుతున్నారు, ఒక సినిమా ఫేట్ ఏంటో చెప్పడానికి రివ్యూ లు ప్రధాన భూమిక పోషించేవి, కానీ ఈ ఇయర్ లో కొన్ని సినిమాల రివ్యూ లను కూడా కేర్ చేయకుండా ఆడియన్స్ ఆ సినిమాలకు బ్రహ్మరధం పట్టారు. ముందుగా ఈ ఇయర్ లో వచ్చిన ఎఫ్ 2 సినిమా యావరేజ్ అంటూ 2.5 నుండి 2.75 స్టార్ రేటింగ్ ఇచ్చారు అందరూ కానీ సినిమా ఏకంగా 84.51 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటింది.

తర్వాత సమ్మర్ లో వచ్చిన మజిలీ కి కూడా 2.75 రేటింగ్ యావరేజ్ గా ఇచ్చినా సినిమా దుమ్ము లేపుతూ ఏకంగా 40.23 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక డబ్ మూవీస్ లో కాంచన 3 కి కేవలం 2.25 నుండి 2.5 స్టార్ రేటింగ్ ఇచ్చినా ఆడియన్స్ మెప్పుతో ఆల్ మోస్ట్ 20 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక రీసెంట్ గా వచ్చిన మహేష్ మహర్షి కి 2.5 టు 2.75 రేటింగ్ ఇచ్చినా ఆడియన్స్ మెప్పు తో ఏకంగా 100 కోట్ల షేర్ పైపు అడుగులు వేస్తూ దుమ్ము లేపింది. మొత్తం మీద తెలుగు ఆడియన్స్ మనసులు మారుతున్నాయి అని చెప్పాలి. రివ్యూ లను పట్టించుకోకుండా తమ కి నచ్చితే ఇతరులకు చెబుతూ సినిమాలను ఆదరిస్తున్నారు. ఇది కచ్చితంగా మంచి పరిణామం గా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here