శర్వానంద్…ప్రామిసింగ్ హీరో… మంచి సినిమా పడితే 25-30 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే సత్తా ఉన్న హీరో, కానీ ఇదంతా 2017 వరకు మాత్రమే, తర్వాత నుండి శర్వానంద్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోతున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన శ్రీకారం సినిమా కి మంచి టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు అతి కష్ట తరంగా మారి శర్వానంద్ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీగా…
నిలవడం ఖాయం అయ్యింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రామిసింగ్ హీరో నుండి ఇప్పుడు వరుస ఫ్లాఫ్స్ తో తన మార్కెట్ ని చాలా వరకు డౌన్ చేసుకున్నాడు శర్వానంద్… 2017 స్టార్టింగ్ లో శతమానం భవతి సినిమా తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన శర్వానంద్ ఆ సినిమా తర్వాత…
రాధ సినిమాతో ఫ్లాఫ్ కొట్టినా వెంటనే మళ్ళీ మహానుభావుడు సినిమాతో సూపర్ హిట్ ని అందుకుని మళ్ళీ జోరు చూపాడు, కానీ తర్వాత మొదలు అయింది అసలు సమస్య, ఎన్నో ఆశలతో చేసిన పడి పడి లేచే మనసు డిసాస్టర్ అవ్వగా తర్వాత చేసిన రణరంగం సినిమా కూడా అట్టర్ ఫ్లాఫ్ అయింది.
ఇక తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 96 మూవీ ని తెలుగు లో జాను పేరుతొ రీమేక్ చేయగా ఈ సినిమా అయినా కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటే సినిమా కి టాక్ బాగానే వచ్చినా కానీ ఆడియన్స్ ను మినిమమ్ ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను దక్కించుకుని షాక్ ఇచ్చింది. ఇక రీసెంట్ గా మంచి కాన్సెప్ట్ తో…
మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన శ్రీకారం సినిమా మిగిలిన సినిమాల కన్నా కూడా బెటర్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ మినిమమ్ కనిపించలేదు, పోటి లో ఉన్న జాతిరత్నాలు భీభత్సం సృష్టించడం కూడా ఈ సినిమాకి ఎదురుదెబ్బ కొట్టి మరో ఫ్లాఫ్ పడేలా చేసింది, దాంతో 4 ఏళ్లలో 4 ఫ్లాఫ్స్ తో కెరీర్ ని కొనసాగిస్తున్న శర్వానంద్ అన్నీ కుదిరితే మహా సముద్రంతోనే కంబ్యాక్ ఇస్తాడని అంతా ఆశిస్తున్నారు.