కెరీర్ ని మొదలు పెట్టినప్పటి నుండి హై బడ్జెట్ మూవీస్ ని, సాలిడ్ స్టార్ కాస్ట్ ను సెలెక్ట్ చేసుకుని సినిమా కి హైప్ ను సొంతం అయ్యేలా చేసుకుని తీరా సినిమా రిలీజ్ అయ్యాక అంచనాలను అందుకొక పోవడం తో హిట్స్ ని అందుకోలేక పోతున్న హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ అందరికన్నా ముందు నిలుస్తాడు అని చెప్పాలి. కెరీర్ మొదలు పెట్టి ఆల్ మోస్ట్ 7 ఏళ్ళు అవుతున్నా కేవలం ఒకే ఒక్క హిట్ ని…
సొంతం చేసుకున్న బెల్లంకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర రాక్షసుడు హిట్ తర్వాత అల్లుడు అదుర్స్ తో ఫ్లాఫ్ అందుకోగా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కి ప్రయాణం అయ్యాడు. తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఛత్రపతిని హిందీ లో రీమేక్ చేయాలనీ డిసైడ్ అయిన బెల్లం కొండ…
మరో పక్క తమిళ్ లో రీసెంట్ సూపర్ హిట్ కర్ణన్ ని తెలుగు లో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అటు హిందీ రీమేక్ ఇటు తెలుగు రీమేక్ లు రెండూ కూడా ఇప్పుడు సెట్స్ ఎక్కడం లేదని తెలుస్తుంది. ఛత్రపతి హిందీ రీమేక్ కి కొంచం బ్రేక్ రాగా కర్ణన్ రీమేక్ ని…
తెలుగు లో వెంటనే మొదలు పెట్టాలని భావించినా కానీ యూనిట్ కన్ఫాం అవ్వడం లేదని తెలుస్తుంది. డైరెక్టర్ గా శ్రీకాంత్ అడ్డాల ని అనుకున్నా అడ్డాల నో చెప్పగా ఛత్రపతి రీమేక్ కి డైరెక్టర్ అయిన వినాయక్ తోనే కర్ణన్ రీమేక్ ని కూడా ఇవ్వాలని భావించారు కానీ వినాయక్ కూడా ఇప్పటి వరకు ఏ నిర్ణయం చెప్పలేదట.
దాంతో డైరెక్టర్ గా మరెవరినైన వెతికే ఆలోచనలో టీం ఉన్నా ఎవ్వరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. కారణాలు ఏంటో కానీ ప్రస్తుతం రెండు రీమేక్ లు కూడా పట్టాలు ఎక్కడం లేదని అంటున్నారు. త్వరలోనే కర్ణన్ రీమేక్ ని మాత్రం ఎలాగైనా పట్టాలు ఎక్కించాలని చూస్తున్నారు. మరి ఎవరిని కన్ఫాం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.