టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన నటులు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు, అలాంటి వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం కొందరే అని చెప్పాలి. ఇప్పుడు ఆ కోవలోకే వచ్చే హీరోల్లో తేజ సజ్జ కూడా ఒకరు. చిన్నప్పటి నుండి సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చిన తేజ సజ్జ ఆల్ మోస్ట్ అందరు స్టార్స్ తో కలిసి నటించాడు అని చెప్పాలి. ఇంద్ర లో చేసిన రోల్ కి…
ఇప్పటికీ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి క్యారెక్టర్ రోల్ గా సమంత ఓ బేబీ సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన తేజ సజ్జ ఈ ఇయర్ జాంబి రెడ్డి సినిమా తో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు….
ఆడియన్స్ ముందుకు ఇష్క్ సినిమా తో వచ్చిన తేజ సజ్జ ఈ సినిమా తో అంచనాలను అనుకున్న రేంజ్ లో అందుకోక పోయినా అప్ కమింగ్ మూవీస్ ని స్ట్రాంగ్ గానే ప్లాన్ చేస్తున్నాడు. జాంబి రెడ్డి డైరెక్టర్ తో ఇప్పుడు హనుమాన్ అనే భారీ సినిమా చేస్తున్నాడు తేజ సజ్జ…
ఈ సినిమా తర్వాత కూడా వరుసగా సినిమాలను కమిట్ అవుతున్న తేజ సజ్జ ఇప్పుడు ఒక్కో సినిమా కి కోటికి తగ్గని రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడని సమాచారం. ఇష్క్ సినిమా కి 60 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకున్న ఈ హీరో ఇప్పుడు చేస్తున్న హనుమాన్ కి 1 కోటి రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత మార్కెట్ మరింత పెరిగితే రెమ్యునరేషన్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇష్క్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా అప్ కమింగ్ సినిమా తో తనకంటూ ఒక స్టేబుల్ మార్కెట్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. హనుమాన్ సినిమా వర్కౌట్ అయితే తేజ సజ్జ రేంజ్ ఇంకా పెరగొచ్చు.