బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా పండగ అడ్వాంటేజ్ ను వాడుకుంది చిన్న సినిమా పెళ్లి సందD, తొలిరోజు వరల్డ్ వైడ్ గా 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రలలో 250 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా చాలా సెంటర్స్ లో మహా సముద్రం కన్నా కూడా బెటర్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకుని రోజును ఇప్పుడు ఘనంగా ముగించడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి.
సినిమా మొదటి రోజు మొత్తం మీద 60% రేంజ్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకోగా అసలు టాక్ ఏంటి అనేది కూడా చూడకుండా పెళ్ళిసందడి పేరుకున్న వాల్యూ అండ్ రాఘవేంద్రరావు స్టాంప్ వలన ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి తరలి వచ్చారు. దాంతో ఇప్పుడు సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో…
మినిమమ్ 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునేలా ఉందని చెప్పొచ్చు. అసలు ఈ రేంజ్ లో వస్తాయి అని కూడా అంచనా వేయలేదు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్ల బాగుంటే సినిమా 1.5 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఫస్ట్ డే అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.