మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర 11 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా సెన్సార్ పనులకు రీసెంట్ గా వెళ్ళగా, సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా రన్ టైం 2 గంటల 30 నిమిషాల రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఇక సినిమా కి సెన్సార్ వాళ్ళ నుండి బాగుంది అనిపించే టాక్ వినిపిస్తుంది అని చెప్పాలి…
కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయక పోయినా కానీ జైలులో ఉండే రవితేజ కి ఒక స్టొరీ ఉంటుందని, అతను జైలుకి రావడానికి డింపుల్ హయతి హత్యకి లింక్ ఉంటుందని, కానీ ఆ మిస్టరీ ఏంటి, కంటైనర్స్ లో డబ్బు ఎక్కడ నుండి వచ్చింది, ఆ మిస్టరీ కూడా ఏంటి అనేది…. ఇంటర్వెల్ అండ్ సెకెండ్ ఆఫ్ లో మరిన్ని నిజాలు…
రివీల్ అవుతాయని అంటున్నారు… సినిమాలో ట్విస్ట్ లు టర్న్ లు మెయిన్ హైలెట్ అని, అలాగే యాక్షన్ సీన్స్ మరో హైలెట్ గా నిలుస్తుందని, కంప్లీట్ గా స్క్రీన్ ప్లే బేస్ తో నడిచే ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు… ఓవరాల్ గా సినిమా….
కథ పరంగా కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తో ఆ కాంప్లికేషన్స్ కి సెకెండ్ ఆఫ్ లో ఇచ్చే ఆన్సర్స్ ఆడియన్స్ కి ఎంత బాగా నచ్చుతాయో అన్న దానిపై సినిమా ఏ రేంజ్ కి వెళుతుంది అన్నది చెప్పగలమని అంటున్నారు. ఓవరాల్ గా సెన్సార్ వాళ్ళ నుండి అయితే సినిమా బాగుంది రవితేజ రీసెంట్ మూవీస్ లో క్రాక్ కన్నా ముందు చేసిన…
సినిమాలు అన్నింటిలోకి బెస్ట్ మూవీ అని అంటున్నారు… ఫైనల్ టాక్ ఏంటి అంటే మాత్రం ఎబో యావరేజ్ రేంజ్ అని వినిపిస్తుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ రేంజ్ టాక్ వచ్చినా కానీ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పాలి. ఇక సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయితే ఇక రచ్చ మరో లెవల్ లో ఉంటుందని చెప్పాలి. మరి ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.