బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టిన 6 ఏళ్ల గ్యాప్ కి మొట్ట మొదటి సారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సొంతం చేసుకున్నాడు అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని… బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్, హలో మరియు మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు ఒకటి తర్వాత ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఎట్టి పరిస్థితులలో కూడా హిట్ కొట్టాల్సిన అవసరంతో…
అఖిల్ అక్కినేని నుండి వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయంగా నిలిచి అఖిల్ కి ఎక్స్ లెంట్ క్రేజ్ వచ్చేలా చేయగా ఈ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని చేస్తున్న స్టైలిష్ యాక్షన్ మూవీ ఏజెంట్ సినిమా…. ఈ సినిమాను…
టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తూ ఉండగా ఈ సినిమా తో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి తన రేంజ్ ని పెంచుకునే అవకాశం ఎంతైనా ఉండగా రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ అంచనాలను భారీగా పెంచేసింది…. సినిమా కి బడ్జెట్ ఇష్యూ ఉందని లేటెస్ట్ టాలీవుడ్ టాక్ అని చెప్పాలి….
సురేందర్ రెడ్డి సినిమాలు అంటే బడ్జెట్ కొంచం ఎప్పుడూ ఎక్కువ అవుతుంది అన్న టాక్ ఉంది, స్టైలిష్ మేకింగ్ అండ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వని సురేందర్ రెడ్డి ఈ సారి కూడా కాంప్రమైజ్ అవ్వక పోవడంతో బడ్జెట్ కొంచం హద్దులు దాటుతూ ఉండటంతో తన రెమ్యునరేషన్ ని కొంచం తగ్గించుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తూ ఉండగా అఖిల్ అక్కినేని ఏకంగా….
ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉండటానికి ఒప్పుకున్నారు అంటూ చెబుతున్నారు ఇప్పుడు…. నిర్మాత సేఫ్ గా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది. ఇది కనుక నిజం అయితే అఖిల్ నటుడిగా నిర్మాత గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయంతో మరో మెట్టు ఎక్కేశాడు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ భారీ మాస్ హిట్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.