బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మొదటి 4 రోజుల్లో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం సినిమా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇలాంటి టైం లో ఇప్పుడు 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 4వ రోజు లెవల్ లో ఓపెన్ అవ్వగా కొన్ని చోట్ల ఈ రోజు సినిమాకి ఎక్స్ ట్రా స్క్రీన్స్ ని కూడా యాడ్ చేశారు… ఇక సినిమా మ్యాట్నీ షోల నుండి మంచి జోరునే చూపిస్తూ ఉండగా ఈ రోజు…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా మరోసారి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక సినిమా ఈ రోజు మినిమమ్ 7.5 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అది కొంచం ఔట్ ఆఫ్ రీచ్ అనే చెప్పాలి కానీ సినిమా కనుక ఈవినింగ్ షోలకు అంచనాలను మించి గ్రోత్ చూపిస్తే దగ్గరకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
5 రోజుల లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సాధిస్తున్నా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.