యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్ అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయిన సినిమా టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సినిమా 90 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో…
కేవలం 28.20 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని టార్గెట్ లో ఏకంగా 61.80 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. అలాంటి డిసాస్టరస్ రిజల్ట్ తర్వాత డిజిటల్ లో కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయిన సినిమా….
తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. అప్పటికే భారీ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న లైగర్ మూవీని స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ చేయగా సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సినిమా కి రేటింగ్ భారీగా…
నిరాశ కలిగించే విధంగా రేటింగ్ ను సొంతం చేసుకుంది. కేవలం 6.68 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమా ఛానెల్ కొన్న రేటుకి భారీగా నిరాశ పరిచే రిజల్ట్ సొంతం అవ్వగా ఇతర సినిమాల రేటింగ్ తో పోల్చితే పర్వాలేదు అనిపించింది అని చెప్పాలి కానీ ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తో పాటు టి.ఆర్.పి రేటింగ్ కూడా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.
In Vijay Devarakonda career, Liger is one of the biggest disaster…that’s why he is not coming in to the news