బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా రిమార్కబుల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేస్తుంది. సూపర్ పాజిటివ్ టాక్ పవర్ తో అల్టిమేట్ గా దుమ్ము లేపుతున్న ఈ సినిమా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 32.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 43.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
సొంతం చేసుకోగా ఇప్పుడు 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు సినిమా 4 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా…
5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 5 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద అటూ ఇటూగా 37 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకో బోతూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా…
ఇప్పుడు 48.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని చోట్లా సినిమా 4వ రోజు మాదిరిగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద సినిమా 5 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.