బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని కలెక్షన్స్ తో అల్టిమేట్ లాంగ్ రన్ ని కొనసాగిస్తున్న సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా భారీ లాభాలను సొంతం చేసుకుంటుంది. సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే ఇతర భాషల రిలీజ్ ను కూడా కన్ఫాం చేసుకున్నా చివరి నిమిషంలో ఇతర భాషల్లో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.
2 వారాల తర్వాత సినిమా హిందీలో మలయాళంలో తమిళ్ లో రిలీజ్ అయ్యింది. ఇక్కడ వచ్చిన రేంజ్ టాక్ ని ఇతర భాషల్లో కూడా సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతుంది అనుకోగా అనుకున్నట్లే టాక్ బాగానే వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా ఇంపాక్ట్ ని చూపలేదు.
టాక్ స్ప్రెడ్ అయినా కానీ హిందీలో పోటిలో ది కేరళ స్టొరీ, మలయాళంలో 2018 సినిమాలు విరూపాక్ష సినిమాను ఊహించని ఎదురు దెబ్బ తీశాయి. రెండు చోట్ల ఈ 2 సినిమాలు సాలిడ్ టాక్ ఇంపాక్ట్ వలన విరూపాక్ష సినిమా టాక్ బాగున్నా కలెక్షన్స్ రాక పోవడంతో ఆ థియేటర్స్ ని సొంతం చేసుకుని..
స్క్రీన్స్ ని పెంచుకున్నాయి ఇప్పుడు. దాంతో వీకెండ్ తర్వాత విరూపాక్ష ఇతర భాషల వర్షన్ లు ఆడుతున్న థియేటర్స్ చాలా తగ్గిపోయాయి. ఇక తమిళ్ ఆడియన్స్ మరోసారి మంచి సినిమా వచ్చినా ఏమాత్రం విరూపాక్ష పై చూపించలేదు. దాంతో లేట్ రిలీజ్ విరూపాక్షకి ఇతర భాషల్లో ఎదురుదెబ్బ పడేలా చేసింది.