మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్(Sai Dharam Tej) నటించిన సమ్మర్ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష(Virupaksha) సినిమా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ కి ముందు కొంచం లో ఎక్స్ పెర్టేషన్స్ ఉండగా…
రిలీజ్ అయిన తర్వాత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని లాంగ్ రన్ లో ఊచకోత కోస్తూ 48.20 కోట్ల రేంజ్ లో షేర్ ని 90.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో సినిమా ఏకంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా సినిమా…
25.20 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను దక్కించుకుని ఊహకందని ఊచకోత కోయగా టెలివిజన్ లో సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు మొత్తం మీద 11.68 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…
సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో రెండో సారి టెలికాస్ట్ అవ్వగా రెండోసారి కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా ఏకంగా 7.80 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఊరమాస్ జోరుని చూపించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.
స్టార్ మా ఛానెల్ లో సినిమా కొన్న రేటుకి మొదటి సారే మంచి ప్రాఫిట్స్ సొంతం అవ్వగా రెండో సారి టెలికాస్ట్ కి భారీ లాభాలను సొంతం చేసుకుందని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ తో పాటు టెలివిజన్ లో కూడా ఊరమాస్ జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉంది ఈ సినిమా…