బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 4 వారాలను కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) దుమ్ము దుమారం లేపుతూ భారీ హిట్ గా నిలవడమే కాదు ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
తొలిరోజు సినిమాకి వచ్చిన టాక్ కి ఈ రేంజ్ రన్ అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. ఇక సినిమాకి మొదటి రోజు ఓవరాల్ గా సోషల్ మీడియాలో ఏమాత్రం బాలేదు అంటూ ట్రోల్స్ పడ్డాయి…కొరటాల శివ మళ్ళీ ఆచార్య సినిమానే తిప్పి తీశాడు అంటూ…
దేవర సినిమాను ఆచార్య2 మూవీ అంటూ ట్రోల్ చేశారు…కట్ చేస్తే సినిమా ఆ ట్రోల్స్ తోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తూ బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసి ఆల్ మోస్ట్ 4 వారాల పాటు షేర్స్ ని సాధించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…
ఇక సినిమా రిలీజ్ కి ముందు ఎప్పటి నుండో ఎన్టీఆర్ నుండి యునానిమస్ రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా రాలేదు. ఈ సినిమా ఆ లోటుని తీర్చుతుంది అని ఫ్యాన్స్ ఆశించినా మొదటి రోజే మిక్సుడ్ టాక్ తో ఆచార్య2 అనిపించే టాక్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ…
ఏకంగా ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి సినిమాను సైతం మించిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు….ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ హిట్ అండ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న దేవర సినిమా సింహాద్రి సినిమాను మరిపించే రేంజ్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
రీసెంట్ టైంలో ఇలా మిక్సుడ్ రివ్యూలు, రేటింగ్ లు, సోషల్ మీడియాలో ట్రోల్స్ ని ఫేస్ చేసినా కూడా ఇలాంటి రన్ ను అందుకున్న టాప్ స్టార్ మూవీ దేవర అనే చెప్పాలి. అదే టైంలో సినిమాకి ఫస్ట్ డే సింహాద్రి రేంజ్ టాక్ వచ్చి ఉంటే ఈ కలెక్షన్స్ జాతర ఇంకా మాసివ్ గా వచ్చి ఉండేది అని చెప్పొచ్చు.